ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం  తెలుపుతూ  అన్ని పుస్తకాలు ఒకేసారి దిగుమతి(Bulk Download)  విభాగానికి స్వాగతం...

       సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో లేక DLI నుంచి సేకరించిన 4200 పుస్తకాలను(e-books) ఒకేసారి ఎలా దిగుమతి(డౌన్లోడ్) చేసుకోవాలో ఇవ్వబడినది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, 
  ఈ అవకాశాన్ని  సద్వినియోగం  చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు  చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా  ఇబ్బంది కలిగితే సేవక బృందంను 
  
  సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో  ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు.  ఈ క్రింది చెప్పబడిన డౌన్లోడ్(దిగుమతి)  విధానం తెలియచేసే pdf పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు. డౌన్లోడ్(దిగుమతి)  విధానం వీడియో ద్వారా  కూడా  వివరించటం జరిగింది. 

            Bulk Download(దిగుమతి) చేసుకొనే విధానం:

   1) మొదట firefox వెబ్ బ్రౌజరు install చేసుకోవాలి. 

   2) తర్వాత Downthemall అనే చిన్న సాఫ్ట్ వేర్ ని firefox వెబ్ బ్రౌజరు లో install చేయాలి. 

          (అనగా మొదట firefox వెబ్ బ్రౌజరు ఓపెన్ చేసి, ఈ సైట్ కి  http://www.downthemall.net వెళ్లి ఆ సాఫ్ట్ వేర్ మీద క్లిక్ చేస్తే బ్రౌజరు లో install అగును )

   
   3) ఇప్పుడు మన సాయి రామ్ వెబ్ సైట్ నుంచి బుక్స్ లింక్స్ కలిగిన ఫైల్స్  డౌన్లోడ్(దిగుమతి) చేసుకోవాలి
              e-Books-Download-by-Firefox.zip

                పై URL  పై క్లిక్  చేస్తే  (లేక) బ్రౌజరు లో Enter చేస్తే ఈ క్రింది విధముగా zip  ఫైల్  దిగుమతి అయి వుంటుంది.
   ఈ 33 ఫైల్స్ zip చేసి వున్నాయి, కావున unzip చేసి ఒక ఫోల్డర్ లో వుంచుకోవాలి.
   ఇలాగా 33 txt ఫైల్స్ (33 విభాగాల సంబంధించిన) కనిపిస్తాయి.


    4)  Firefox వెబ్ బ్రౌజరు open చేసి, అందులో గల DownThemAll Manager ని open చేయాలి   ఇప్పుడు ఒక్కో విభాగపు txt ఫైల్(Bulk Books URL’s)  ను ఈ సాఫ్ట్ వేర్ లోకి లోడ్ చేయాలి.
      5) Select సాయి రామ్ గ్రంధాల విభాగపు(భక్తి యోగం,రామాయణం..) txt ఫైల్    


   6) Filter button enable చేసి అన్ని ఫైల్స్(బుక్స్) ని select చేసుకోవాలి(దీనివల్ల ఒక్కో పుస్తకాన్ని select చేసుకొనే శ్రమ తప్పును. అన్ని పుస్తకాలు వద్దు అనుకొంటే నచ్చినవి ఎంచుకోగలరు.)
                                      select చేయక ముందు:


                                          select చేసిన తర్వాత:
  


   7) ఇలా డౌన్లోడ్ అవుతూ వుంటుంది.. అలాగే pause, resume,stop చేసుకోవచ్చు.   8) Download అవుతున్నసేపు ఈ విండో ని అలాగే వుంచి, మీ పని మీరు చేసుకోవచ్చు.
   9) ఈ విధముగా 33 విభాగపు గ్రంధాలు మొత్తం(4000 e-Books) డౌన్లోడ్ చేసుకోవాలంటే  33 files/సార్లు  ఈ విధముగా చేయాలి.  అప్పుడు అన్ని గ్రంధాలు దిగుమతి అగును, లేక మీకు ఇష్టమైన 
         ఏ ఒక్క విభాగపు(రామాయణం, భారతం...) కావాలంటే కూడా దిగుమతి చేసుకోవచ్చు. 

  10) ఒకవేళ పొరపాటుగా close చేస్తే, తిరిగి ఈ DownThemAll ని తిరిగి ఓపెన్ చేయాలంటే firefox బ్రౌజరు ఓపెన్ చేసి Manager మీద క్లిక్ చేసి, డౌన్లోడ్ అవుతున్నాయో లేదో చూసుకొని resume చేయగలు.   సదా సాయినాధుని సేవలో,

  సాయి రామ్  సేవక బృదం

 

 సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org

సాయి రామ్ ఫేస్ బుక్: https://www.facebook.com/SaiRealAttitudeManagement

సాయి రామ్ సేవక బృందాన్ని  సంప్రదించుటకు:  sairealattitudemgt@gmail.com

                       * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *