కర్మ,భక్తి,జ్ఞాన యోగ రహస్యాలు!
    
 సాయి రామ్ సేవక బృందం కర్మ,భక్తి,జ్ఞాన యోగ  సంబంద రహస్యాలను చిత్ర రూపంలో సేకరణ చేసి ఉడతా భక్తిగా  అందిస్తున్నాము!  
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని
ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము 
కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.


   భగవంతుని యందు శ్రద్ధ ఎలా ఉండాలి ?

  బావిలో ఉన్న కప్ప అదే ప్రపంచం అనుకొంటుంది, అలాగే అజ్ఞానంతో జీవుడు కూడా తాను పరిమితుడు అని తలచుతున్నాడు!
Inline image 1

 బావిలో ఉన్న కప్ప ఎలా అయితే తన భౌతిక పరిది(బావి) ని దాటి ఏదయినా సముద్రం వుందని చెప్పితే ఎలా వినిపించుకోదో, శాస్త్రవేత్త తన బౌతికపరిది ని దాటి అనంత  శక్తి వంతమైనది ఒకటి వుందంటే వినిపించుకోడు! 
Inline image 2
 కర్మ నుంచి ఎట్టి పరిస్థితులోనూ తప్పించుకోలేవు, ఒక్క భగవంతునిపై పరమ ప్రేమ(భక్తి), (ఆత్మ) జ్ఞానం వల్ల తప్ప! 
Inline image 3       భగవంతుని జగన్నాటకంలో సత్,రజో,తమో అనే గుణాలచేత జీవుడు అడబడుతున్నాడు!
Inline image 4శరీరం రథం. రథం నడిపే రథికుడు బుద్ధి. మనస్సు రథానికున్న గుర్రాలను నియంత్రించే పగ్గాలు. రథానికుండే గుర్రాలు ఇంద్రియాలు. రథం నడిచే వీదులు విషయ పదార్ధాలు. ఈ రథం యొక్క యజమాని ఆత్మ!

Inline image 5ఆత్మ జ్ఞాని అన్నింటిలో "ఆత్మనే" దర్శిస్తాడు. అలాగే పరాభక్తుడు అన్నింటిలో తన  "ఇష్ట దైవాన్ని" దర్శిస్తాడు.
Inline image 6అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లొభ, మోహ, మద, మాత్సర్యాల ద్వారా జీవుడిని ఆకర్షించి మాయలో పడవేస్తూ భగవంతునికి దూరం చేస్తున్నాయి!
Inline image 7
తప్పించుకోలేని కర్మ నుంచి కూడా భక్తి తో అధిగమించవచ్చు. కనుక భగవంతుని గురించి తెలుసుకోవటం, భక్తి తో ఉండటం వల్ల నీ చేతులలో లేని, ఊహించని ప్రమాదం వచ్చినప్పుడు సహాయకారిగా ఉండును, కనీసం అందుకోసమైనా సాధన మొదలుపెట్టు ఓ మిత్రమా..
Inline image 8
Inline image 9
చిరిగిన వస్త్రం విడిచి, నూతన వస్త్రం ఎలా ధరిస్తామో! అలా శరీరం వదలిన తర్వాత, నూతన శరీరం వారు చేసిన కర్మలను బట్టి ధరిస్తారు!
Inline image 10
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*