సాయి రామ్ గురించి
                                   (విలువలతో కూడిన విద్య అందరికి సులబంగా,ఉచితంగా అందించాలనే లక్ష్యంతో...)       

          సాధారణంగా వేద విజ్ఞానం తెలుసుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది, ఎందుకంటే మనస్సును,ఆలోచలను  అదుపులో ఉంచగలిగే శక్తి  వేద విజ్ఞానానికి ఉంది. ఈరోజున  కుటుంబాలు చిన్నవి కావటం, పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, కుటుంబ కలహాల రీత్యా విడిగా, దూరంగా వుంటున్నారు. అలాగే చదివే విద్యలో వృత్తికి సంబందించినదే కాని, మనస్సుకు సంబందించినది ఒక్క పుస్తకం కుడా  పాఠాలలో లేదు.అంటే మనం చదువుతున్న చదువులో, విధానం లో ఏదో లోపం ఉంది, ఎందుకంటే సరాసరి ఒక వ్యక్తి 16 సంవత్సరాలు విద్య అబ్యసిస్తాడు, అంటే ఈ 16 సంవత్సరాలలో ఒక్క పుస్తకం కూడా మనస్సుకు సంబందించినది లేకపోవడం విచారకరం. అంతేగాక ఏ పనైనా చేయాలంటే, సాదించాలంటే మనస్సు మాత్రం కావాలి. మరి మనస్సుకు జ్ఞానాన్ని చెప్పే గురుకులాలు కనుమరుగయ్యాయి. కాని జన్మ ఎత్తిన తర్వాత మనస్సు తో పోరాడాలి, అందుకు ఉపాయాలు,జ్ఞానం, ఆయుధాలు కావాలి, ఎక్కడ ఉంటాయి? ఎక్కడ సమాచారం దొరుకుతుంది? 

              ఒకప్పుడు ఒక కష్టం వస్తే చెప్పుకోవడానికి, ఓదార్పబడటానికి  అమ్మమ్మ,తాతయ్య,అవ్వ,నాయనమ్మ ఉండేవారు, కనీసం తల్లి, తండ్రి తోడుగా వుండేవారు, ఈ రోజున అటువంటి తోడు దొరకటం లేదు. మరి ఎలా ఈ  మనస్సును అదుపుచేసుకోవటానికి కావలసిన జ్ఞానం ఎవరు ఇస్తారు? బడిలో ఈ రోజున ఎవరూ  నీతి, ధర్మం, సత్యం,విలువలు బోధించటం లేదు, అంతేగాక ఇంట్లో కూడా ఆ బోదనలు దొరకటం లేదు. ఇది వీరి తప్పు అని అనలేము..కారణం కాలం, యుగరీత్య మారుతుంది...  మరి నా పరిస్థితి ఏమిటి? బడిలో చెప్పని పాఠాలు, ఇంట్లో లభించని బోధనలు ఎలా తెలుసుకొనేది? ఎదుకంటే ఈ  రోజుల్లో ఏ కష్టం వచ్చినా నీకు నీవే ధైర్యం చెప్పుకోవాలి, ఓదార్చుకోవాలి. అంటే ఎవరికి వారే తెలుసుకోవాలి,  నేర్చుకోవాలి, మార్చుకోవాలి!  మరి ఎలా సత్యం తెలుసుకోవటం, ధైర్యం పొందటం ఎలా? మనస్సును అదీనంలో ఉంచుకోవటం ఎలా? 

       మనస్సుని,ఆలోచనలను  అధీనంలో ఉంచుకోవటం అనేది మన సనాతన ధర్మం వలన చాలా సులభం. అందుకు కావలసిన ధర్మాలు,జ్ఞానం,విలువలు మన రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతాది  గ్రంధాలలో సులభంగా అర్ధం అయ్యే విధముగా పొందుపరచబడ్డాయి. సామాన్యులు ఈ గ్రంధాలు చదివితే సులభంగా మనస్సుని అధీనంలో  ఉంచుకోగలరు. కావున అందరికి సులభంగా, ఉచితంగా ఆధ్యాత్మిక గ్రంధాలు అందుబాటులో ఉండాలి. అనగా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఆధ్యాత్మిక గ్రంధాలయం ఉండాలి.

            ఇందు కోసం  కొన్ని నెలలుగా ఇంటర్నెట్లో ఆధ్యాత్మిక సంబంద తెలుగు పుస్తకాలను వెదకటం జరిగింది, ఎందుకంటే సత్యాన్ని అర్ధం చేసుకోవాలంటే అది మాతృ బాష లో కలిగిన పుస్తకాలు అయితేనే సులభంగా అర్ధం  చేసుకోగలం అని, మాతృ భాషలో గల భక్తి, జ్ఞాన పుస్తకాలు కోసం వెదకగా కొన్ని వేల పుస్తకాలు లభించాయి.కానీ  నెలల పాటు వేదికితేనే ఇవి లభించినాయి కదా..నాలాంటి వాళ్ళు తప్పక కొందరు ఉంటారు!  మరి వారి పరిస్థితి ఏమిటి? అని సేకరించిన పుస్తకాలను మొదట online లోకి సులభంగా అందుబాటులోకి తీసుకురావాలి, అదే మొదటి కర్తవ్యం!  ఎందుకంటే ఒక పుస్తకాన్ని పొందాలంటే  ఈ రోజున ఎన్నో Marketing,Spam,Ads దాటుకొని చదవాలి లేక డౌన్లోడ్ చేసుకోవాలి, ఎంతో బాధ వేసింది. అంతేగాక అవి ఎక్కడెక్కడో ఉన్నాయి, మరి వాటి అన్నింటిని ఒకచోటకి చేర్చటం అందరికి కుదరకపోవచ్చు...మరి  దీనికోసం ఉచిత సర్వీస్ అందిచే వాటికోసం వెదకగా గూగుల్ సైట్స్  వాళ్ళు ఉచితం గా వెబ్ సైట్ అందిస్తున్నారు, అలాగే archive వాళ్ళు ఉచిత storage ని ఎటువంటి ads లేకుండా అందిస్తున్నారు.వీరు చేస్తున్న ఉచిత  సర్వీస్ నేను మరువలేను.

           మనం కృతజ్ఞత  తెలియచేయవలసిన వారిలో మన భారత ప్రభత్వపు లైబ్రరీ(http://www.new.dli.ernet.in), ఎందుకంటే ఈ రోజున ఇన్ని పుస్తకాలు  అందివ్వగలుగుతున్నామంటే అది వారి ఉచిత పుస్తకాలే కారణం. మొదటగా పుస్తకాలను డౌన్లోడ్ చేయాలి ఇందుకోసం కొందరు మహానుభావులు(Munish Chandel & Arun Sharma)   ఒక సాఫ్ట్ వేర్ తయారుచేసారు, దాని ద్వారా సంవత్సరాలు పట్టే సమయం కొన్ని నెలలకు తగ్గింది.అలా అది దొరకటం సాయినాధుని కృప వల్లనేమో! అలా డౌన్లోడ్ January 2014 మొదలు పెడితే June 2014 కు నా తమ్ముని(శ్రీనివాస రెడ్డి), స్నేహుతుని (రామాంజనేయులు) సహాయంతో  డౌన్లోడ్ పూర్తయింది.

                           ఇక పుస్తకాలను అన్నిటిని వర్గీకరించాలి అనగా గ్రందాలను నాణ్యత, ప్రింట్, వర్గం ప్రకారం వేరుచేయటం, అలాగే అక్కరలేనివి  వేరుచేసి ఒక క్రమం లో పేర్చు కోవటం జరిగింది. ఇలా June లో మొదలుపెట్టి September వరకు చేయగలిగాము. అలా September 2014 నుంచి March 2015 నాటికి, సాయినాధుని కృపవల్ల డౌన్లోడ్ చేసిన పుస్తకాలను PDF గా మార్చటం, Excel sheet లో లింక్స్ తయారు చేయటం, ఆర్కైవ్ సైట్ లోకి upload చేయటం, వెబ్ సైట్ డిజైన్ చేయటం  జరిగింది. ఇప్పటికి మేము “ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం” అనే కార్యక్రమం ద్వారా  వెబ్ సైట్(ఇంటర్నెట్ ఉన్నవారికి) ద్వారా, పెన్ డ్రైవ్(ఇంటర్నెట్ లేనివారికి) ద్వారా,  మొబైల్(ఆండ్రాయిడ్ ఆప్) ద్వారా ఉచితముగా,సులభంగా గ్రంధాలు చదువుకొనే ఏర్పాటు కల్పిస్తున్నాము.

                   ఈ రోజు తృప్తిగా  మీలో ఒకడిగా నేను కుడా మీతో పాటు చదువుకొంటున్నాను, ఈ మనస్సుని  అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను.ఎందుకంటే సేకరిచిన దాదాపు 4200  పుస్తకాలలో కొన్ని అమూల్య రత్నాలు, ఆణిముత్యాలు వున్నాయి. ఒక్కో పుస్తకం లో క్రొద్ది పాటి సమాచారం చదివినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఎందుకటే ఈ జ్ఞానం నేను చదివిన బడిలో చెప్పలేదు, బయటా దొరకలేదు.


  నేను సైతం:
        సాయి రామ్ అనేది ఏ ఒక్కరిది కాదు, మీరు అందరు సేవక బృందంలో పాల్గొని తమవంతు సేవ అందించగలరు.మేము ప్రధానంగా గమనించిన విషయము ఏమిటంటే కొన్ని మంచి గ్రంధాల ప్రింట్ సరిగ్గా లేకపోవటం, వారు వాడిన  ఆ కాలపు ఫాంట్  ఈ కాలపు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కావున మాకు ఒక ఆలోచన వచ్చింది, మేము ప్రతి excel షీట్ లో నాణ్యత అనే కాలమ్ ఇచ్చాం, అందులో 2,3,4 గలిగి ఇష్టమైన వర్గం నుచి ఒక పుస్తకం  ఎంచుకొని  word లో టైపు చేసి లేక pdf రూపంలో అందించగలరు.ఇందులో సాయి రామ్ కోరుకొనేది ఒక్కటే,  మంచి,నాణ్యత,నూతన ప్రింట్ కలిగిన పుస్తకాలను సాధ్యమైనంత వరకు ఎక్కువగా అందుబాటులోకి ఉచితంగా అందివ్వాలి, అందుకు  సహకరించే ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు. సమాజాన్ని నిందిస్తూ కూర్చోవటం కన్నా చిరుసేవ చేయటం మిన్న!
      ఉదాహరణకు, మహానుభావులైన మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు  తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, మిగిలిన ఖాళీ సమయాన్ని ఉపయోగించి రామాయణం, మహాభారతం, భాగవతం గ్రంధాలను వచన రూపం లోకి అనువదించారు.


  సాధారణంగా వచ్చే సందేహాలు, సమాధానాలు:

 1) సాయి రామ్ వెబ్ సైట్ లక్ష్యం ఏమిటి?
                                                               నన్ను “నేను” తెలుసుకోవటానికి
                                                               నన్ను “నేను” మార్చుకోవటానికి
                                                                     “నేను” గా ఉండటానికి 
        మరియు అత్యుత్తమ జీవన విధానానికి కావలసిన భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సమాచారం ఒకేచోట తెలుగులో ఉచితంగా ఉడతా భక్తిగా అందించాలన్నదే!

 2) సాయి రామ్ పేరుని ఎలా ఎంచుకొన్నారు?
     షిర్డి సాయి నాధుని జీవిత చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు, ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే ఇప్పుడు ఉన్న, నా వ్యక్తిత్వం అంతా అబద్దపు తత్త్వం కలిగినది, నిజమైన వ్యక్తిత్వం కలిగి లేను, నిజానికి నేను ఆత్మని, అంతటా  వ్యాపించి వున్న పరబ్రహ్మాన్ని, కాని అలా ప్రవర్తించక అబద్దపు వ్యక్తిత్వంలో జీవిస్తున్నాను, అంటే నేను ఎవరో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి,"నేను" గా వుండాలి, అంటే ఒక నిర్వహణ విధానంగా జరగాలి, అలా Real  Attitude Management అన్న పదం తోచింది, దానికి నా గురుదేవుని నామం SAI కలుపగా, ఆవిర్భవించినదే SAI RAM. ఇది నా గురుదేవుని సంకల్పంగా భావిస్తున్నాను. ఏమో ఆయన ఏమి చేయిస్తున్నాడో, ఎందుకు  చేయిస్తున్నాడో ఆయనకే ఎరుకు. 

3)  సాయి రామ్ లో ఏ ఏ వర్గాలు కలిగి వున్నాయి?
    మొత్తం ఇప్పటివరకు 33 విభాగాలను అందిస్తున్నాము.
     1     భక్తి యోగం
     2     కర్మ యోగం
     3     రాజ యోగం
    4     జ్ఞాన యోగం
    5     రామాయణం
    6     మహాభారతం
    7     భగవద్గీత
    8     పురాణములు
    9     భాగవతము
    10     వేదములు
    11     ఉప వేదాలు
    12     వేదాంగాలు
    13     ఉప వేదాంగాలు
    14     ఉపనిషత్తులు
    15     గీతలు
    16      ధర్మము
    17      కథలు
    18     శతకాలు
    19      సూక్తులు
    20     కావ్యాలు
    21     నాటకాలు 
    22     కీర్తనలు
    23     గేయాలు
    24     దేవిదేవతలు
    25     గురువులు
    26     భక్తులు
    27     కవులు
    28     జీవిత చరిత్ర 
    29     మహిళలు
    30      పిల్లలు
    31     చరిత్ర
    32     విజ్ఞానము
    33     వ్యక్తిత్వ వికాసం

4)  ఎలా గ్రంధాలను అమర్చారు?
       యోగ విధానాలు  అన్ని కలిపి చోట, పురాణం, ఇతిహాసాలు కలిపి ఒకచోట, వేదాలు సంబంద విభాగాలు ఒకచోట, జీవిత చరిత్ర(గురువులు,దేవిదేవతలు,భక్తులు,కవులు,మహిళలు,పిల్లలు) ఒక చోట వచ్చేవిధంగా అమర్చగాలిగాము.        

5) ఇప్పటివరకు ఎన్ని గ్రంధాలను online లో కి వచ్చాయి?
      4200+ (మేము ఎక్కడైతే భాగాలు గా కలిగిన గ్రంధాలను సాధ్యమైనంతవరకు కిలిపి ఒకటిగా అందిస్తున్నాము, అనగా పుస్తకం పేరు-మొదటి భాగం, పుస్తకం పేరు-రెండవ భాగం ఇలావుంటే మొత్తం రెండు భాగాలను కలిపి ఒకే పుస్తకంగా ఇస్తున్నాము, దీనివల్ల మళ్ళి,మళ్ళి మిగతా భాగాల కోసం వెతుక్కోకుండా, డౌన్లోడ్ అవసరంలేని విధంగా, ఒకే చోట కలిగి వుండాలన్నదే మా ధ్యేయం. ఇలా చాలా పుస్తకాలను ఒకే భాగంగా అందించాము. 

6) అన్ని గ్రంధాలను ఒకేచోట ఎలా చూడగలము, పొందగలము ?
       ఇక్కడ గల లింక్ లో ఇవ్వబడినది

7) అన్ని గ్రంధాలను ఒకేసారి ఎలా డౌన్లోడ్(దిగుమతి) చేసుకోగలము ?
       ఇక్కడ గల లింక్ లో వివరించబడినది. అలాగే ఇక్కడ ఇవ్వబడిన వీడియో లో వివరించడం జరిగింది.

8) ఎలా ఇష్టమైన, కావలసిన పుస్తకాన్ని వెదకగలను.
     --మొదటగా ఇస్టమైన పుస్తకం ఏ వర్గం క్రిందకు వస్తుందో మొదటి ప్రశ్న లో గల విభాగాలను చూసి నిర్ణయించు కొని, ఆ విభాగపు యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే పుస్తకాలు కనపడును.
    -- మీరు  crtl+f ద్వారా సెర్చ్ చేస్తే ఆ పేజీ లో గలవి వెదకగలరు. మీరు ఇంగ్లీష్ గాని, తెలుగు తో గాని సెర్చ్ చేసుకొని ప్రయత్నించగలరు.
     --లేకపోతె  నాల్గవ ప్రశ్న లో గల అన్ని పుస్తకాలు కలిగిన Excel sheet డౌన్లోడ్ చేసుకొని, sort or filter or search  ఆప్షన్ ద్వారా వెదకగలరు.
     --మరిన్ని వివరాలకోసం ఇక్కడ గల వీడియో చూడగలరు.

9)  ఎలా చదవాలి, డౌన్లోడ్ చేసుకోగలను.
     ఇష్టమైన వర్గంలోగల పుస్తకాన్ని ఎంచుకొన్న తర్వాత, blue అక్షరాలు కలిగిన లింక్ మీద క్లిక్ చేస్తే మీ బ్రౌజరు లో ఆ లింక్ ఓపెన్ అగును, కొద్దిపాటి సమయంలో పుస్తకం డౌన్లోడ్ అయి, మీరు చదువుకొనే విధంగా తయారు అగును,     అప్పుడు మీరు చదువుకోగలరు, అలాగే ఆ ఒక్క పుస్తకాన్ని డౌన్లోడ్(దిగుమతి) చేసుకోగలరు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ గల వీడియో చూడగలరు.

10) ఎలా ఇతరులకు share చేయగలం?
   సాయి రామ్ వెబ్ సైట్ లింక్ ఇతరులకు ఇచ్చినా పర్వాలేదు, బుక్స్ లింక్ కలిగిన లింక్ ను పంచుకొనినా పర్వాలేదు.కాని మీరు ఒక పుస్తకాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలంటే, మీరు Excel sheet లో blue అక్షరాలపై క్లిక్  చేయగానే, ఈ విధమిన format(https://archive.org/download/xxxxxx....) లో ఒక లింక్ బ్రౌజరు లో ఓపెన్ అగును, వెంటనే ఆ లింక్ ని కాపీ చేసుకోవాలి, దానిని ఎవరికైనా share చేసుకోవచ్చు, అలాగాక కొద్దిసేపు తర్వాత  ఇటువంటి లింక్ తో మొదలయ్యేది (https://ia902309.us.archive.org/6/items/xxxxxx....) share చేసుకొంటే ఒక్కోసారి పనిచేస్తుంది, లేకపోతె పనిచేయదు..గ్యారంటీ ఇవ్వలేము. 
 ఉదాహరణ:  ఇటువంటి లింక్ ని share చేసుకోవచ్చు: https://archive.org/download/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Pillalu/PI103-PillalaPempakam.pdf
               ఇటువంటి లింక్ share చేసుకోలేము. https://ia902309.us.archive.org/6/items/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Pillalu/PI103-PillalaPempakam.pdf

11) epub,kindle ఫార్మాట్లో ebooks లభిస్తాయా ?
     ఇప్పటివరకు మేము PDF format మాత్రమే అందుబాటులోకి తీసుకురాగలిగాం...ప్రస్తుతానికి ఆ format మేము support చేయడం లేదు.

12) Excel sheet లో నాణ్యత అనే పదానికి అర్ధం ఏమిటి ?
   పాతకాలపు ఫాంట్, పేజీల నాణ్యత ను బట్టి 1,2,3,4 గా విభజించాం, అంటే 1 అనగా ప్రధమ రకం నాణ్యత(word format కలిగిన నూతన ప్రింట్), 2 అనగా ద్వితీయ రకం scanned image ప్రింట్, అంటే ఫోటో రూపంలో పేజీ  ఉండును, దీనిలో టైపు చేసి సరిచేయలేము, కాని నూతన ప్రింట్ దాదాపు కలిగివున్నది. 3 అనగా తృతీయ రకం పాతకాలపు ఫాంట్ కలిగి వున్న image పుస్తకాలు. ఇలా విభజించటం వెనుక అర్ధం ఏమిటంటే, సులభంగా నూతన ప్రింట్  కలిగినవి Excel sort ద్వారా వెదుకుకొనుట, అలాగే "నేను సైతం" కార్యక్రమంలో పాల్గొనే వారు సులభంగా నాణ్యతను గుర్తించి నూతన ప్రింట్ లోకి అనువదించ గలరు.

13) ఎవరు ఏ పుస్తకం అందించారో, ఎవరు ఆ పుస్తకానికి మూలమో ఎలా తెలుసుకొనేది ?
  మేము ప్రతి పుస్తకం ఆ మహానుభావులను స్మరిస్తూ, వారి చేస్తున్న సేవను తెలుపుతూ, వారి వెబ్ సైట్ అండ్ ఫోటో ని ఆ పుస్తకం లో మొదట్లో అందిస్తున్నాము, వారి సేవను మేము మరువలేము. కనుక మీరు ప్రతి పుస్తకం లో మీరు   ఆ పుస్తకం యొక్క మూలం ఎవరో తెలుసుకోగలరు.

14)  ఎవరెవరు సహాయం అందిస్తున్నారు? వారికీ ఏమైనా ధనం చెల్లించాల్సి ఉందా ?
      google sites(https://sites.google.com/),  Archive(https://archive.org), Microsoft(https://onedrive.live.com). వీరు అందరు ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. వారి ఉచిత సేవలతోనే ఇది నిర్మాణం చేసాం.కనుక 
     ఉచితం గానే అందిస్తున్నాము,

15)  ebooks కి మరెక్కడైనా mirror కలిగినవి ఉందా? మరెక్కడైనా స్టోర్ చేస్తున్నారా?
       లేదు, ఒక్క archive లోనే ఇప్పటివరపు భద్రపరిచాం.

16)  నేను నా దగ్గర వున్న పుస్తకాలను స్కాన్ చేసి ఇవ్వవచ్చా ?
       మీకు ఆ పుస్తకాలపై అధికారాలు వుండి వుంటే, అంటే మీరు వ్రాసిన, ఉచిత పబ్లిష్ చేసుకోగలిగిన అయితే పంపించవచ్చు,కాని ఇతరులు వ్రాసినవి, అనధికారమైనవి మేము ప్రచురించలేము!

17)  నేను ప్రింట్ తీసుకోవచ్చా ?
      మీరు వ్యక్తిగతంగా చదువుకోవడానికి అనుమతి గలదు. 

18) నేను అమ్ముకోవచ్చా?
      మచిపద్దతి కాదు అని చెప్పాలి!, కొన్ని పుస్తకాలు ebooks రూపంలో share చేసుకోవటానికి మాత్రమే అనుమతి గలదు, కావాలంటే ebook రూపంలో share చేసుకోవచ్చు.

19)  పుస్తకంలో భారత ప్రభుత్వ గుర్తింపు సంఖ్య అని ఒక నెంబర్ వుంది అది ఏమిటి ?
      ఆ నెంబర్ ఒక్క DLI books కు మాత్రమే గలదు, అంటే ఈ ప్రత్యేకమైన నెంబర్ తీసుకొని DLI లో సులభంగా వెదకగలరు,అందుకోసం ఆ గుర్తింపు సంఖ్య అందిస్తున్నాము. 

20)  ప్రతి పుస్తకం కవర్ పేజి లో దీపం,పుష్పం, రెండు చేతుల మధ్య  మొక్క గల గుర్తులు వున్నాయి, ఏమిటి?
     దీపం,పుష్పం జ్ఞానానికి గుర్తు! నన్ను నేను తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి, అలా తెలుసుకొనిన జ్ఞానాన్ని కాపాడుకోవటం అనేది రెండు చేతులతో మొక్కను కాపాడినట్టు గా ఆలోచన గలిగింది, అలా డిజైన్ చేయటం జరిగింది. 

21)  ఇది వ్యాపారమైన వెబ్ సైట్ ?
      ఇది పూర్తిగా ఉచిత, లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సమాచర వెబ్ సైటు. ఈ సైటులో ఎటువంటి ads గాని,రిజిస్ట్రేషన్ గాని, ధనం గాని చెల్లించనక్కరలేదు. 

22)  కాలేజీ లకు, స్కూల్ లకు, గురుకులాలకు, లైబ్రరీ లకు, పీఠాలకు ఉచితంగా ఒకేసారి అందిస్తారా ?
    అవును, మాకున్న శక్తి కొలది, ఈ గ్రంధాలను వెళ్లి ఉచిత సర్వీస్ చేసే ప్రయత్నంలో వున్నాము, కాని బల్క్ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కుడా సదుపాయం కలదు. మొదట ఇక్కడ గల bulk download ప్రయత్నం చేయగలరు.

23)  ఎవరైనా చదుకోదగిన పుస్తకాలా ?
  అవును,అందరికి, అన్ని వయస్సుల వారికి తగిన, ఆశ్రమ ధర్మాలకు తగిన పుస్తకాలు అందుబాటులో గలవు.

24)  ఇంగ్లీష్ లో సమాచారం కలిగిన పుస్తకాలు కుడా అందుబాటులో ఉన్నాయా ?
  ఇది పూర్తిగా తెలుగులో గల ebooks మాత్రమే లభ్యం అయ్యేలా చేస్తున్నాము..

25)  సినిమా, పొలిటికల్,నావెల్స్ లాంటివి కుడా అందిస్తారా?
    లేదు, ఇది పూర్తిగా భక్తి,జ్ఞాన సంబంద పుస్తకాలకే పరిమితం.

26)  ఇది పూర్తిగా హిందు,సనాతన ధర్మ సంబంద పుస్తకాలు సంబందించినదేనా ?
    అవును

27)  ఈ సైట్ ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే?
   ఒక మంచి పనిని చేసున్నప్పుడు పొందే సంతృప్తి మాటలలో చెప్పలేము, కనుక పేరు గురించి అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, అవసరమైనప్పుడు తెలియజేయగలము.

28)  నా వెబ్ సైట్ లో సాయి రామ్ గురించి ప్రమోట్ చేయవచ్చా?
   ఎటువంటి అశ్లీలం లేని,  మతపరమైన ఇబ్బందులు తలెత్తని చోట ఇతరులతో పంచుకోవచ్చు.

29) సాయి రామ్ లో వచ్చే క్రొత్త పుస్తకాలు, మార్పులు తెలుసుకోవాలంటే ?
   మీరు మీ మెయిల్ నుంచి updates కోసం మెయిల్ రిక్వెస్ట్ చేస్తే మేము తెలియచేయగలము. అలాగే updates అనే లింక్ లో కుడా తెలియచేయగలము

30)  సాయి రామ్ వెబ్సైటు background ను ఇతరులు కూడా డిజైన్ చేసి పంపించవచ్చా?
   అవును, ఏది అయిన ఒక పండుగ, గురువుల జయంతి సందర్బంగా  తెలియచేసే థీమ్ డిజైన్ ను 1200*1600 pixel సైజులో చేసి, కుడి,క్రింది మూలలో మీ మెయిల్,ఫోటో తో పాటు అందివ్వగలరు. ఆ రోజున మేము ప్రచురించగలం. 

31) సాయి రామ్ గురించి ఏ ఏ లింక్స్,సోషల్ మీడియా sites లో గలదు.
     సాయి రామ్ సమాచారం: https://web.facebook.com/SaiRealAttitudeMgt
     సాయి రామ్ సంబంద వీడియోలు: https://www.youtube.com/user/sairealattitudemgt   

32)  ఈ సైట్ ఎవరికీ అంకితం?
      మా గురుదేవులు షిర్డి సాయినాధుని పాద పద్మములకు నమస్కరిస్తూ, సాయి బాబా కు అంకితం.

33)  ఎటువంటి సమాచారాన్ని సేకరించారు ?
   భారత ప్రభుత్వపు DLI వెబ్సైటు లో గల గ్రంధాలు పూర్తిగా కాపీరైట్ ఫ్రీ పుస్తకాలు, ఆ గ్రంధాలనే మేము తీసుకొని, వివిధ వర్గాలుగా విభజిస్తూ, pdf format లో అందిస్తున్నాము, అలాగే ఇతర ధర్మ ప్రచార సంస్థలు వారు వారి వెబ్సైటు లో పంచుకొన్న    గ్రంధాలను సేకరించి ఒకేచోట అమర్చాము. కావున కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న పుస్తకాలను  గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి. వెంటనే వాటిని  తొలగించగలము.అలాగే ప్రతి పుస్తకంలో మూల సేకరణ గురించి, ఆ మహానుభావులను స్మరించటం జరిగింది. 

34)  ఎలా క్రొత్త సమాచారాన్ని అందిస్తారు.
  మాకు ఏమైనా క్రొత్త పుస్తకాలు అందిన వెంటనే వాటిని, అందరితో పంచుకోగలము. అలాగే పైన చెప్పిన విధంగా నేను సైతం కార్యక్రమంలో పాల్గొని నూతన ప్రింట్ కలిగిన పుస్తకం అందిస్తే, వాటిని ఎప్పటికప్పుడు online లో  ఇక్కడ గల  లింక్ లో అందించగలం. 

35)  ఇవి కాక ఇంకా ఏమి ఉచిత సేవలు అందిస్తున్నారు.

   Pen Drive(offline):                   www.sairealattitudemanagement.org/pendrive
   Android App(Online):                www.sairealattitudemanagement.org/app
  Telugu Bhakti Videos:                www.telugubhakthivideos.org
  Telugu Bhakti Samasacharam:   http://telugubhakthisamacharam.blogspot.in


ఎందరో మహానుభావులకు  సేవక బృందం తరపున పాదాభివందనం తెలియచేసుకొంటున్నాము:
    మేము క్రింద ఇవ్వబడిన వారి పేర్లు, మరియు వారు చేస్తున్న ఉడతా భక్తి సేవకు మేము శిరసు వంచి వారి పాదాలకు నమస్కరిస్తున్నాము. ఎందుకంటే వారు చేస్తున్న జ్ఞాన యజ్ఞం వల్ల కొన్ని అమూల్యమైన రత్నాల్లాంటి గ్రంధాలు  మీకు వారి వెబ్సైటు నుచి సేకరించి అందివ్వటం జరిగింది, కనుక వారి సేవను ఈ జన్మకి  మరువలేము.

http://www.new.dli.ernet.in (3463)
http://www.mohanpublications.com (67)
https://www.scribd.com   (61)
http://dwarkadheeshvastu.com   (55)
http://www.telugubhakti.com  (53)
https://archive.org  (50)
http://www.geetadeeksha.com (43)
http://srividyasaradhi.org  (30)
http://thraithashakam.org  (28)
http://www.sundarayya.org  (20)
http://www.srichalapathirao.com  (18)
http://www.saibharadwaja.org (17)
http://www.srinannagaru.com  (15)
http://rkmath.org (15)
http://andhra-telugu.com/bhakti (10)
http://www.greatertelugu.com  (10)
http://www.unworldliness.org  (9)
http://www.lordofsevenhills.com   (8)
http://www.vikasadhatri.org ( 5)
http://telugudevotionalswaranjali.blogspot.in  (4)
http://telugubhagavatam.org  (3)
http://www.sripadavallabha.com  (3)
http://mulugu.com  (2)
http://neetikathalu.wordpress.com (1)
http://www.andarikiayurvedam.in  (1)
http://yatharthgeeta.com (1)ఉచితం:
    సాయి రామ్ అందించే సర్వీసెస్ అన్ని ఉచితమే.అన్ని కూడా ఉచిత సేవలు అందించే వారిని నుంచి సేకరించబడినాయి. ఒకవేళ మేము పొరపాటుగా కాపీరైట్ ఉల్లంగించాము అనిగాని, అనుమతి తీసుకోలేదనిగాని అనిపిస్తే మమ్ము  క్షమించవలసిందిగా  కోరుకొంటూ, వారి పాదములకు నమస్కరిస్తూ, వేడుకొంటూ మాకు తెలియచేయగలరు, మేము సరిదిద్దుకోగలము, ఎందుకంటే ఈ కార్యం ఎటువంటి, కీర్తి, ధనం ఆశించి చేయటం లేదు, ఒక వేల ఏమైన పొరపాటు  చేస్తే అది అందరికి అందుబాటులో ఉచితం గా వుండాలి, అందరు బాగుపడాలి అన్న దృష్టితో మాత్రమే. 


సమర్పణ:
 సర్వం శ్రీ సాయినాధుని పాదాల చెంత సమర్పించి, ఆ సాయినాధుడు మా చేత ఉడతాభక్తి గా ఇటువంటి పని చేసుకోగలిగే భాగ్యం మాకు  ప్రసాదించినందుకు వారి పాదాలకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ వారికి సమర్పిస్తున్నాము. 
ఇట్లు,
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్  సేవక బృదం

తెలుగు భక్తి పుస్తకాలు: http://www.sairealattitudemanagement.org   
తెలుగు భక్తి వీడియోలు: www.telugubhakthivideos.org       
తెలుగు భక్తి సమాచారం: http://telugubhakthisamacharam.blogspot.com
        
తెలుగు భక్తి పుస్తకాల గూగుల్ సైట్: https://sites.google.com/site/sairealattitudemanagement                                                                             
తెలుగు భక్తి పుస్తకాలు ఆర్కైవ్ వెబ్ సైట్: https://archive.org/details/SaiRealAttitudeManagement    

సాయి రామ్ నూతన సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement                                   
సాయి రామ్ సంబంద వీడియోలు: https://www.youtube.com/user/sairealattitudemgt          
సాయి రామ్ సేవక బృందాన్ని  సంప్రదించుటకు:  sairealattitudemgt@gmail.com
ఆండ్రాయిడ్ ఆప్:            https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books

 * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*